అల్లు శిరీష్‌తో లవ్.! రూమర్లపై పెదవి విప్పిన అనూ ఇమ్మాన్యుయేల్.!

- November 09, 2022 , by Maagulf
అల్లు శిరీష్‌తో లవ్.! రూమర్లపై పెదవి విప్పిన అనూ ఇమ్మాన్యుయేల్.!

‘మజ్ను’ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఛైర్‌ని తృటిలో తప్పించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆ ఛైర్‌ని అందుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ, దక్కించుకోలేకపోయింది.
అంతేకాదు, అసలు ఆఫర్లకే దూరమైంది. మళ్లీ అల్లు శిరీష్‌తో ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో సోదిలోకి వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హిట్టులాంటి హిట్టు కూడా కొట్టేసింది. దాంతో, అనూ గురించి మళ్లీ మాట్లాడుకునే అవకాశం వచ్చింది. 
మరోవైపు, అల్లు శిరీష్‌తో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో వుందంటూ పుకార్లు ఈ మధ్య తెగ షికార్లు చేస్తున్నాయ్. అల్లు శిరీష్ ఈ పుకార్లను ఖండించాడు. తాజాగా అనూ ఇమ్మాన్యుయేల్ కూడా స్పందించింది. ఈ వార్తలపై తన తల్లి చాలా బాధపడుతోందనీ, ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ఓకే అయ్యేంతవరకూ తనకు అసలు శిరీష్ ఎవరో తెలియనే తెలియదు. అంతకు ముందెప్పుడూ తనను చూడనే లేదు.. అని అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పింది.
దీంతో, అనూకీ, శిరీష్‌కీ మధ్య ఏదో వుందన్న పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి మరి. అన్నట్లు ఇప్పుడిప్పుడే అనూ ఇమ్మాన్యుయేల్ మళ్లీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com