అబుధాబి ప్రధాన రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులు
- November 10, 2022
యూఏఈ: అబుభాబి-అల్ ఐన్ రోడ్లో వేగ పరిమితిని గంటకు 160 కి.మీ నుండి 140 కి.మీకి తగ్గించినట్లు అబుధాబి పోలీసులు ప్రకటించారు. ఈ గరిష్ట వేగం అల్ ఐన్ సిటీ దిశలో అల్ సద్ బ్రిడ్జ్ నుండి అల్ అమెరా బ్రిడ్జ్ వరకు వర్తిస్తుందని తెలిపారు. అబుధాబి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ సంయుక్త సలహా ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నవంబర్ 14 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. యూఏఈ రాజధానిలో స్పీడ్ బఫర్లు లేవన్న విషయం తెలిసిందే. వాహనదారులు సురక్షితంగా డ్రైవ్ చేయాలని, వేగ పరిమితులు పాటించాలని పోలీసులు పిలుపునిచ్చారు. హైవేలపై వేగాన్ని తగ్గించడం వల్ల రోడ్డు ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయని అధికారులు గుర్తు చేశారు.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..