వచ్చే ఏడాది నుంచి యూఏఈలో నిరుద్యోగ బీమా తప్పనిసరి

- November 10, 2022 , by Maagulf
వచ్చే ఏడాది నుంచి యూఏఈలో నిరుద్యోగ బీమా తప్పనిసరి

యూఏఈ: 2023 జనవరి 1 నుండి నిరుద్యోగ బీమా పథకాన్ని కొనుగోలు చేయడం తప్పనిసరి అని మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ప్రైవేట్ రంగ కంపెనీలు, సమాఖ్య ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నెలకు Dh5 నుండి నిరుద్యోగ బీమా పథకంలో సభ్యత్వాన్ని పొందవచ్చని తెలిపింది. క్రమశిక్షణేతర కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయినట్లయితే, ఈ పథకం పరిమిత కాల వ్యవధిలో ప్రతి క్లెయిమ్‌కు వరుసగా మూడు నెలలకు మించకుండా నగదు ప్రయోజనాన్ని అందిస్తుందని తెలిపారు. నిరుద్యోగ బీమా పథకానికి సంబంధించిన మరింత సమాచారాన్ని http://www.iloe.aeవెబ్ సైట్ లో చూడాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com