BIAS 2022లో ఇండియా పెవిలియన్‌ను ప్రారంభించిన భారత రాయబారి

- November 10, 2022 , by Maagulf
BIAS 2022లో ఇండియా పెవిలియన్‌ను ప్రారంభించిన భారత రాయబారి

బహ్రెయిన్: సఖిర్ ఎయిర్ బేస్‌లో జరుగుతున్న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో (BIAS) 2022లో ఇండియా పెవిలియన్‌ను బహ్రెయిన్‌లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ వైస్ మార్షల్  శ్రీనివాసన్, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (రవాణా & హెలికాప్టర్లు), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ కుమార్ భాస్కర్ల, ఎంబసీ అధికారులు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ , భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇండియన్ పెవిలియన్‌లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) సంస్థల ఉత్పత్తులు అయినా...  BEL నైట్ విజన్ పరికరాలు, రాడార్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌, BDL ఆకాష్ SAMలు, ఆస్ట్రా ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్స్, అండర్ వాటర్ డిస్పెన్సింగ్ సిస్టమ్‌లను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.

మనామా ఎయిర్ పవర్ సింపోజియంలో రాయల్ బహ్రెయిన్ వైమానిక దళం ఆధ్వర్యంలో నిర్వహించిన సింపోజియంలో  'ఎయిర్ రీఫ్యూయలింగ్, ట్రాన్స్‌పోర్టింగ్ అండ్ బాంబింగ్: ది ఎవాల్వింగ్ రోల్ ఆఫ్ అన్ మ్యాన్డ్ సిస్టమ్స్ అండ్ ఇంటిగ్రేషన్ రిక్వైర్‌మెంట్స్' అనే అంశంపై కూడా భారతదేశం తరఫున ఎయిర్ వైస్ మార్షల్  శ్రీనివాసన్ పాల్గొని ప్రసంగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com