‘పుష్ప 2’ షూటింగ్ స్టార్ట్ అయ్యిందోచ్.! కానీ, బన్నీ మాత్రం.!

- November 10, 2022 , by Maagulf
‘పుష్ప 2’ షూటింగ్ స్టార్ట్ అయ్యిందోచ్.! కానీ, బన్నీ మాత్రం.!

దాదాపు ఏడాది సమయం తర్వాత ‘పుష్ప 2’ సెట్స్ మీదికెళ్లింది. ‘పుష్ప’ మొదటి పార్ట్‌కి అనూహ్యంగా హైప్ రావడంతో, సెకండ్ పార్ట్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టింది సుకుమార్ అండ్ టీమ్.
దాంతో, స్క్రిప్టు పేరు చెప్పి లాంగ్ గ్యాప్ తీసుకున్నారు సెకండ్ పార్ట్ స్టార్ చేయడానికి ‘పుష్ప 2’ టీమ్. ఎట్టకేలకు అన్నీ కుదిరి తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. 
రామోజీ ఫిలిం సిటీలో డైరెక్టర్ సుకుమార్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అయితే, ఈ షెడ్యూల్‌లో ఇంకా బన్నీ జాయిన్ కాలేదనీ తెలుస్తోంది. బన్నీ లేకుండానే ఇతర తారాగణంపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్.
ప్రస్తుతం బన్నీ ఫిట్‌నెస్ వ్యవహారాల్లో బిజీగా వున్నాడట. అతి త్వరలోనే షూటింగ్‌కి హాజరు కానున్నాడనీ తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మండన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com