‘పుష్ప 2’ షూటింగ్ స్టార్ట్ అయ్యిందోచ్.! కానీ, బన్నీ మాత్రం.!
- November 10, 2022
దాదాపు ఏడాది సమయం తర్వాత ‘పుష్ప 2’ సెట్స్ మీదికెళ్లింది. ‘పుష్ప’ మొదటి పార్ట్‌కి అనూహ్యంగా హైప్ రావడంతో, సెకండ్ పార్ట్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టింది సుకుమార్ అండ్ టీమ్.
దాంతో, స్క్రిప్టు పేరు చెప్పి లాంగ్ గ్యాప్ తీసుకున్నారు సెకండ్ పార్ట్ స్టార్ చేయడానికి ‘పుష్ప 2’ టీమ్. ఎట్టకేలకు అన్నీ కుదిరి తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.
రామోజీ ఫిలిం సిటీలో డైరెక్టర్ సుకుమార్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అయితే, ఈ షెడ్యూల్లో ఇంకా బన్నీ జాయిన్ కాలేదనీ తెలుస్తోంది. బన్నీ లేకుండానే ఇతర తారాగణంపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్.
ప్రస్తుతం బన్నీ ఫిట్నెస్ వ్యవహారాల్లో బిజీగా వున్నాడట. అతి త్వరలోనే షూటింగ్‌కి హాజరు కానున్నాడనీ తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మండన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి