తెలుగు నాట సంక్రాంతి పండుగకి తమిళ పైత్యం.!
- November 10, 2022
ఈ సంక్రాంతికి సినీ బరిలో దూసుకెళ్లేందుకు మూడు తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయ్. అందులో అగ్రహీరోలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, నందమూరి నటసింహం బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాలు మొదటి స్టానంలో వుండగా, తానేం తక్కువ కాదంటూ, అక్కినేని హీరో అఖిల్ ‘ఏజెంట్’గా రాబోతున్నాడు.
సంక్రాంతి సీజన్ అంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా, ఎన్ని సినిమాలనైనా తన భుజ స్కంధాలపై మోసేస్తుంది. ఇది కాదు అసలు విషయం. ఈ సీజన్‌లో మరో రెండు తమిళ సినిమాలు రేస్‌లో వున్నాయ్. విజయ్ నటిస్తున్న ‘వారిసు’, తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
అలాగే, అజిత్ చిత్రం ఒకటి. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయ్. అందులో తప్పేముంది అంటారా.? తెలుగు సినిమాలతో పోల్చితే, ఈ తమిళ సినిమాలకు సంబంధించి ప్రమోషన్ల హవా బాగా నడుస్తోంది. తెలుగు సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే వుంటే, తమిళ సినిమాలు మాత్రం ప్రమోషన్ల హోరులో రోజుకో అప్‌డేట్‌తో సందడి చేస్తున్నాయ్.
ముఖ్యంగా ‘వారిసు’ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కావడం వల్లనో ఏమో, బలవంతంగా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులపై రుద్దేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపో మాపో అజిత్ సినిమా కూడా ప్రమోషన్ల జోరు పెంచనుందట. ఎందుకో తెలీదు, ఈ సారి సంక్రాంతికి ఈ తమిళ సినిమాలను బలవంతంగా తెలుగు ధియేటర్లలో చొప్పించేందుకు గట్టిగా కంకణం కట్టుకున్నారు. చూడాలి మరి, బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా నెగ్గుతుందా.? తమిళ సినిమా నెగ్గుతుందా.?
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి