‘లాక్‌డౌన్’లో చిక్కుకున్న హీరోయిన్.! అసలు మ్యాటర్ ఏంటంటే.!

- November 10, 2022 , by Maagulf
‘లాక్‌డౌన్’లో చిక్కుకున్న హీరోయిన్.! అసలు మ్యాటర్ ఏంటంటే.!

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్ అందరికీ గుర్తుండే వుంటుంది. తనదైన మ్యానరిజమ్‌తో ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే యూత్‌లో సరికొత్త క్రేజ్ దక్కించుకుంది. 
అయితే, ఆ తర్వాత పలు వివాదాల కారణంగా కెరీర్ నాశనం చేసుకుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ శ్వేతా బసు ప్రసాద్ హవా కొనసాగుతోంది. అయితే, సినిమాల్లో శ్వేతా జోరు చూపించలేకపోతోంది. ఓటీటీ కంటెంట్‌పై ఫోకస్ పెట్టింది. 
మంచి కంటెంట్ వున్న కథలతో ఓటీటీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది శ్వేతా బసు ప్రసాద్. రీసెంట్‌గా ‘క్రిమినల్ జస్టిస్’ అనే వెబ్ సిరీస్‌లో లాయర్ పాత్రలో కనిపించి మెప్పించింది శ్వేతా బసు ప్రసాద్.
తాజాగా ‘లాక్‌డౌన్’ అను వెబ్ సిరీస్‌తో రాబోతోంది. ఇటీవల తమన్నాతో ‘బబ్లీ బౌన్సర్’ తెరకెక్కించిన మాధుర్ భండార్కర్ ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సిరీస్ కోసం శ్వేతా బసు ప్రసాద్ వేశ్య అవతారమెత్తింది. 
తన పాత్రలోని డెప్త్ నచ్చి ఈ పాత్రకు ఓకే చేశానని శ్వేతా చెబుతోంది. పాత్ర విజువల్‌గా కాస్త హాట్‌గా కనిపించినా, హార్ట్ టచ్చింగ్‌గా వుంటుందనీ, ఖచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులకు నచ్చుతుందనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది శ్వేతా బసు ప్రసాద్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com