బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. నలుగురు సజీవదహనం
- November 10, 2022
ఏపీ: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల కడియద్ద వద్ద బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సజీవదహనం కాగా పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సంభవించిన ప్రదేశంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి.
పేలుడు ఘటనలో గాయపడ్డవారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు