మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నెల రోజుల పాటు జరిగే సింహస్థ కుంభమేళా..

- April 22, 2016 , by Maagulf
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నెల రోజుల పాటు జరిగే సింహస్థ కుంభమేళా..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నెల రోజుల పాటు జరిగే సింహస్థ కుంభమేళా శుక్రవారం ప్రారంభమైంది. పుణ్యస్నానాల కోసం భక్తులు మొదటి రోజు అధిక సంఖ్యలో పోటెత్తారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. ఉజ్జయినిలో దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వరుడి ఆలయం ఉంది. ఈ కుంభమేళా సందర్భంగా శిప్రా నదీ తీరంలో సాధువులు, భక్తులు ఈరోజు పుణ్యస్నానాలు ఆచరించారు.సింహస్థ కుంభమేళా సందర్భంగా ఉజ్జయినికి సుమారు 5 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఈసారి 'గ్రీన్‌ సింహస్థ'గా ఉండాలని శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ కూడా పుణ్యస్నానం చేశారు. ఈరోజు షాహీ స్నాన్‌ సందర్భంగా నదీ తీరంలో దాదాపు 25వేల మంది భద్రతా సిబ్బందిని మోహరింపజేసి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com