భారత్ లో మొదలైన ట్విట్టర్ బ్లూ సర్వీస్..
- November 11, 2022
ట్విట్టర్ బ్లూ సర్వీస్ ఇండియాలో మొదలైంది. కొంతమంది వినియోగదారులు ఇప్పటికే దీనికి సబ్‌స్క్రైబ్ కూడా చేసుకున్నారు. ట్విట్టర్లో అధికారిక, వెరిఫైడ్ అకౌంట్స్‌గా పిలిచే వాటికి బ్లూ టిక్ ఇస్తారు. దీన్ని మొన్నటివరకు ఉచితంగానే ఇచ్చేవాళ్లు.
అయితే, ఇటీవలే ఈ సంస్థను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ ట్విట్టర్ బ్లూ అకౌంట్‌కు నెలనెలా ఫీ వసూలు చేయాలని నిర్ణయించాడు. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ సర్వీస్ మొదలైంది. దీనికి 90 రోజలు గడువు విధించాడు. అంటే ఇప్పటికే ట్విట్టర్ బ్లూ అకౌంట్ పొందిన వాళ్లు లేదా.. కొత్తగా బ్లూ టిక్ కావాలని అనుకునే వాళ్లు 90 రోజుల్లోగా నిర్ణీత రుసుము చెల్లించాలి. దీనికి మన దేశంలో నెలకు రూ.719 వసూలు చేయబోతున్నారు. ట్విట్టర్లో బ్లూ టిక్ కావాలంటే మూడు నెలల్లోగా డబ్బులు చెల్లించాలి. తాజాగా ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. కొందరు యూజర్లు ఇప్పటికే నిర్ణీత మొత్తం చెల్లించి, తమ బ్లూటిక్ కొనసాగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం అందరికీ ఈ సర్వీస్ అందుబాటులోకి రాలేదు.
ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈ సర్వీస్ ప్రారంభమైంది. అంటే యాపిల్ ఐఫోన్ యూజర్లకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఇంకా సర్వీస్ మొదలుకాలేదు. ఇది త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది. మన దేశానికి నిర్ణయించిన ధర చాలా ఎక్కువే అని చెప్పాలి. అమెరికాలాంటి దేశాల్లోనే నెలకు 7.99 డాలర్లు (రూ.645) వసూలు చేస్తున్నారు. కానీ, మన దేశంలో నెలకు రూ.719 వసూలు చేయడమంటే ఎక్కువే అని చెప్పాలి. ట్విట్టర్ బ్లూ అకౌంట్‌కు నెలవారీ డబ్బులు వసూలు చేయాలనే ఎలన్ మస్క్ నిర్ణయంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని వ్యతిరేకిస్తుంటే.. మరి కొందరు సమర్ధిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!