ఒమన్ ఫుట్‌బాల్ ప్లేయర్ యూసుఫ్ షాబాన్ కన్నుమూత

- November 12, 2022 , by Maagulf
ఒమన్ ఫుట్‌బాల్ ప్లేయర్ యూసుఫ్ షాబాన్ కన్నుమూత

మస్కట్: ఒమన్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ యూసుఫ్ షాబాన్ అల్-బుసైదీ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. అతను సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్లలో ఒకడు. ధోఫర్ క్లబ్, అల్ షబాబ్ క్లబ్‌ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు. దివంగత యూసుఫ్ షాబాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు తరఫున ఎన్నో కీలకమైన మ్యాచులలో ఒమన్ ను విజయతీరాలకు చేర్చాడు. అతను వరుసగా మూడుసార్లు గల్ఫ్ కప్ ఫైనల్‌లో కీలక పాత్ర పోషించాడు. మస్కట్‌లో జరిగిన 19వ గల్ఫ్ ఛాంపియన్‌షిప్‌ను ఒమన్ అందుకోవడంలో షాబాన్ కీలకపాత్ర పోషించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com