షార్జాలో అభిమానులను అలరించిన షారూఖ్

- November 12, 2022 , by Maagulf
షార్జాలో అభిమానులను అలరించిన షారూఖ్

యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శన అయిన షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో భారతీయ సినిమా స్టార్ షారుఖ్ ఖాన్ సందడి చేశారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది మంది అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా షార్జా బుక్ అథారిటీ (SBA) చైర్మన్ అహ్మద్ అల్ అమేరి.. షారూఖ్ ఖాన్‌కు మొట్టమొదటి బుక్ ఫెయిర్ గ్లోబల్ ఐకాన్ ఆఫ్ సినిమా అండ్ కల్చరల్ నేరేటివ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా షారూఖ్ మాట్లాడుతూ.. సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు, SIBF డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని.. యాసిడ్ దాడి బాధితులకు, ధైర్యాన్ని ప్రదర్శించిన మహిళలందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. జీవితంలో నిజాయితీగా ఉండాలని యువకులకు సూచించారు. యూఏఈలోని బహుళసాంస్కృతికత అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. షారూఖ్ నటించిన "పఠాన్" సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com