రామగుండంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోడీ

- November 12, 2022 , by Maagulf
రామగుండంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఖమ్మం: ప్రధాని మోడీ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ ప్లాంట్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు.తెలంగాణతో పాటు..దక్షిణాది రాష్ట్రాల్లో రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ కర్మాగారం ద్వారా ఎరువుల కొరత తీరనుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఆరు సంస్థల భాగస్వామ్యంతో FCI , RFCL గా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించారు.ఈ కార్మాగారాన్ని గ్యాస్ ఆధారితంగా రూపొందించారు. ఈ కర్మాగారం పునరుద్ధరణకు రూ. 6,338 కోట్లను కేటాయిచారు. ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా రామగుండం ఎరువుల కర్మాగారం పనిచేయనుంది. ఇందులో ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ఫెర్టిలైజర్స్‌ని తెలంగాణకి కేటాయిస్తారు. మొత్తంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసే ఎరువుల్లో 46 % ఎరువులను తెలంగాణకి ఉపయోగించనున్నారు. మిగిలిన 54 శాతాన్ని ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలకు డిస్ట్రిబ్యూట్‌ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com