రిషికొండ ను పరిశీలించిన పవన్ కళ్యాణ్
- November 12, 2022
విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైజాగ్ లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ప్రధాని మోడీ ని కలిసిన పవన్ కళ్యాణ్..ఈరోజు రిషికొండ ను పరిశీలించారు. గత కొద్దీ నెలలుగా రుషికొండ ఫై వైస్సార్సీపీ నేతలు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని , రుషికొండ ను మొత్తం తవ్వేస్తుందని ఆరోపణల నేపథ్యంలో స్వయంగా దానిని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారు.
కొంతమంది పార్టీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొండపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ షీట్లతో బారీకేడ్లు ఏర్పాటు చేసి ఉండగా…వాటిని ముట్టుకోని పవన్.. ఆ బారీకేడ్లకు ఆనుకుని ఉన్న ఓ మట్టి గుట్టను ఎక్కి… బారీకేడ్ల అవతలి వైపు ఏం జరుగుతోందన్న దానిని పరిశీలించారు.
అలాగే పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి కాసేపు బీచ్ లో నడిచారు. బీచ్ నీళ్లలో కలియతిరిగారు. అక్కడే కనిపించిన మత్సకారులతో మాట్లాడారు. ఫిషింగ్ గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ సడన్ గా బీచ్ కు రావడంతో ఆయన్ని చూసేందుకు స్ధానికులు తరలివచ్చారు.ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్ బీచ్ కు వెళ్లారని తెలియడంతో మీడియా ప్రతినిధులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. తొలుత బీచ్ నీళ్లలో నడుస్తూ ఎంజాయ్ చేసిన పవన్… అనంతరం జనం తాకిడి పెరుగుతుంటంతో అక్కడి నుంచి బయలుదేరారు.అయినా దారిపొడవునా జనం ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
రిషికొండను మింగేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును కనులారా వీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విశాఖపట్నం పర్యటన లో భాగంగా రుషికొండ ను పరిశీలించడానికి వెళ్లగా, కొండ చుట్టూ బారికేడ్లు పెట్టి లోపల పనులు చేస్తుండటంతో బయట నుంచి కొండపై జరుగుతున్న పనులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. pic.twitter.com/flTAs3WfHt
— JanaSena Party (@JanaSenaParty) November 12, 2022
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







