బహ్రెయిన్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్
- November 13, 2022
మనామా: బహ్రెయిన్‌లో 2022 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73 శాతం పోలింగ్ నమోదైంది. 2002లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత అత్యధిక శాతం ఓటింగ్ ఇదే. 40-సభ్యుల కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, 30-సభ్యుల మునిసిపాలిటీ కౌన్సిల్‌లను నాలుగు సంవత్సరాల కాలానికి ఎన్నుకోవడం కోసం శనివారం పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ వివరాలను న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ శాఖ మంత్రి, 2022 ఎన్నికల హైకమిటీ అధిపతి నవాఫ్ బిన్ మహ్మద్ అల్ మువాదా మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అంతరాయం లేకుండా ప్రశాంతంగా సాగిందన్నారు. ఈ సంవత్సరం 40 బహ్రెయిన్ పార్లమెంట్ దిగువ సభ సీట్లకు 561 మంది, 30 మునిసిపల్ కౌన్సిల్ స్థానాలకు 176 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. 2018తో పోలిస్తే ఇది 20 శాతం అధికమని వివరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!