ఉమ్రా: 2 మిలియన్లు దాటిన యాత్రికుల సంఖ్య

- November 14, 2022 , by Maagulf
ఉమ్రా: 2 మిలియన్లు దాటిన యాత్రికుల సంఖ్య

మక్కా: ప్రస్తుత ఉమ్రా సీజన్‌లో తీర్థయాత్ర చేయడానికి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి ఇప్పటివరకు దాదాపు రెండు మిలియన్ల మంది యాత్రికులు సౌదీ అరేబియా చేరుకున్నారు. మొహర్రం 1, 1444 (జూలై 30)న ఉమ్రా సీజన్ ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 1,964,964 మంది యాత్రికుల వివిధ మార్గాల్లో సౌదీకి వచ్చారని సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండోనేషియా నుంచి అత్యధికంగా యాత్రికులు(551,410) వచ్చారన్నారు. 3,70,083 మంది యాత్రికులతో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉండగా.. 230,794 మంది యాత్రికులతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 150,109 మంది యాత్రికులతో ఇరాక్, 101,657 మంది యాత్రికులతో ఈజిప్ట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 11,984 మంది యాత్రికులతో  బంగ్లాదేశ్ చివరి స్థానంలో నిలిచింది. సౌదీ అరేబియా ఉమ్రా వీసా వ్యవధిని ఒక నెల నుండి మూడు నెలలకు పొడిగించిన విషయం తెలిసిందే.  “నస్క్” అప్లికేషన్ (గతంలో ఈట్‌మార్నా యాప్) మొత్తం లబ్ధిదారుల సంఖ్య 20 మిలియన్లకు పైగా చేరుకుందన్నారు. ఈ యాప్ లో ఉమ్రా, గ్రాండ్ మస్జీదులో ప్రార్థన చేయడం, ప్రవక్త మసీదును సందర్శించడం కోసం వివిధ రకాల అనుమతులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com