పొరపాటున ఖాతాలో జమయిన Dhs 3,269,000.. తిరిగిచ్చేందుకు నిరాకరణ

- November 14, 2022 , by Maagulf
పొరపాటున ఖాతాలో జమయిన Dhs 3,269,000.. తిరిగిచ్చేందుకు నిరాకరణ

యూఏఈ: అబుధాబిలో పొరపాటున తన ఖాతాలో జమ చేసిన 3.2 మిలియన్ దిర్హాలను తిరిగి ఇవ్వడానికి ఓ వ్యక్తి నిరాకరించాడు. దీంతో బాధితుడు అబుధాబి ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టును ఆశ్రయించాడు. పొరపాటున మరొక వ్యక్తి ఖాతాలో Dhs 3,269,000 జమ చేసినట్లు తెలిపారు. కానీ ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని వాపోయాడు. ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోర్టును కోరాడు. కేసు పుర్వాపరాలను, పిటిషన్ దారుడు సమర్పించిన పత్రాలను పరిశీలించిన కోర్టు.. పొరబాటున జమయిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, అలాగే కోర్టు ఫీజులు, బాధితుడి న్యాయవాది ఫీజులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com