బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో 2022: మూడు రోజులలో 50 వేల మంది సందర్శకులు
- November 14, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో (BIAS) 2022 ఆరవ ఎడిషన్ ను మూడు రోజుల వ్యవధిలో 50,000 మంది సందర్శకులు సందర్శించారని బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి మొహమ్మద్ బిన్ థామర్ అల్కాబి తెలిపారు. 30కి పైగా దేశాల నుండి 200 కంటే ఎక్కువ మిలిటరీ, సివిల్ డెలిగేషన్‌లు, 186 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయని వివరించారు. అలాగే ఆరు దేశాలు పెవిలియన్‌లను ఏర్పాటు చేశాయన్నారు. దాదాపు 100 మంది ఎగ్జిబిటర్లు ఉన్నాని, వాటిలో 73% అంతర్జాతీయ కంపెనీలని తెలిపారు. స్టాటిక్, ఫ్లయింగ్ డిస్‌ప్లేలలో దాదాపు 100 రకాల విమానాలు ప్రదర్శనలో ఉన్నాయన్నారు. రెడ్ ఆరోస్, సౌదీ హాక్స్, యూఏఈ అల్ ఫుర్సాన్, గ్లోబల్ స్టార్స్‌తో సహా ప్రముఖ బృందాలు మూడు రోజుల పాటు వైమానిక ప్రదర్శనలు నిర్వహించాయని అల్కాబి వెల్లడించారు. ఎయిర్‌షో (BIAS) 2022 సందర్భంగా పలు కంపెనీల మధ్య విలువైన ఒప్పందాలు కుదిరాయన్నారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







