ప్రవాసులకు రుణాలను పునఃప్రారంభించిన బ్యాంకులు

- November 16, 2022 , by Maagulf
ప్రవాసులకు రుణాలను పునఃప్రారంభించిన బ్యాంకులు

కువైట్: కువైట్‌లోని కొన్ని బ్యాంకులు ప్రవాసులకు రుణాలు మంజూరు చేయడం తిరిగి ప్రారంభించాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు మూడు సంవత్సరాలుగా రుణాల మంజూరును బ్యాంకులు నిలిపివేసిన విషయం తెలిసిందే. కొత్త నిబంధనలు, షరతులతో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ప్రవాసులకు తమ రుణ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని బ్యాంకులు తాజాగా నిర్ణయించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సూచనల ప్రకారం.. బ్యాంకులు కూడా ప్రవాసులకు రుణం పొందడానికి కనీస జీతాన్ని తగ్గించాయి. గతంలో 500 దినార్‌లు ఉండగా.. తాజాగా దాన్ని  300 దినార్‌లకు తగ్గించాయి. కనీస పని వ్యవధి కూడా సంవత్సరానికి బదులుగా 4 నెలలకు తగ్గించబడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com