ప్యారిస్‌ ఒప్పందంపై బహ్రెయిన్‌ సంతకం

- April 23, 2016 , by Maagulf
ప్యారిస్‌ ఒప్పందంపై బహ్రెయిన్‌ సంతకం

గ్లోబల్‌ వార్మింగ్‌ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందని బహ్రెయిన్‌ అభిప్రాయపడింది. వాతావరణ మార్పులపై చారిత్రాత్మకమైన ప్యారిస్‌ ఒప్పందంపై బహ్రెయిన్‌ - వరల్డ్‌ హెల్త్‌ డే సందర్భంగా సంతకం చేసింది. కింగ్‌ వ్యక్తిగత ప్రతినితి షేక్‌ అబ్దుల్లా బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇందుకు వేదికయ్యింది. చైనా, అమెరికా కూడా ప్యారిస్‌ క్లైమేట్‌ డీల్‌పై సంతకం చేశాయి. 175 దేశాలకు చెందిన ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌, ఈ ఒప్పందంపై తొలి సంతకం చేశారు. 2020 డెడ్‌లైన్‌గా విధించినప్పటికీ, అంతకన్నా ముందే ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ మానవాళికి ముప్పుగా పరిణమించడంతో, ప్రతి దేశం తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, అలాగే పర్యావరణంపై ఉమ్మడి పోరు అవసరమని ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com