అమెజాన్‌లో ఉద్యోగాల కోతలు మొదలు
- November 17, 2022
శాన్ ఫ్రాన్సిస్కొ: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత పెట్టాలని నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే చర్యలకు నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న వారిలో దాదాపు 10 వేల మందిని ఉగ్యోగాల నుంచి తొలగించనుంది. తొలగింపు ప్రక్రియ బుధవారం ప్రారంభమవగా.. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. అసాధారణ, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ శ్రామిక శక్తిని తగ్గిస్తున్నట్టు అమెజాన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అమెజాన్ డివైజెస్, సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ లింప్ పేరిట వెలువడిన ఈ అధికారిక ప్రకటనలో ప్రభావిత ఉద్యోగుల తొలగింపుల గురించి కంపెనీకి ఇప్పటికే తెలియజేసినట్టు పేర్కొన్నది.
వేటు ఎదుర్కొంటున్న ప్రతి ఉద్యోగితో మాట్లాడి, కొత్త ఉపాధి మార్గాలను అందించేందుకు సహాయం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభావిత ఉద్యోగులకు తొలగింపు గురించి అధికారిక మెయిల్ పంపింది. వేటు ఎదుర్కొంటున్న వాళ్లు అమెజాన్ లో ఇతర విభాగాల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి రెండు నెలల సమయం (నోటీస్ టైం) ఇచ్చింది. సదరు ఉద్యోగులు కొత్త పాత్రను కనుగొనడంలో విఫలమైతే, విభజన చెల్లింపు, పరివర్తన ప్రయోజనాలు, బయట జాబ్ ప్లేస్ మెంట్ కు సహాయం అందించే ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చింది. కాగా, ఫేస్‌బుక్ పేరెంట్ మెటా కూడా గత వారం ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. ఫేస్ బుక్ గత వారం సుమారు 11,000 మందిని తగ్గించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!