బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

- November 17, 2022 , by Maagulf
బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

కర్నూల్: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఆయన కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..”మీరు గెలిపిస్తే మళ్లీ అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే నాకివే చివరి ఎన్నికలు.. టీడీపీని గెలిపించండి, అసెంబ్లీని గౌరవసభ చేస్తా’’.. అంటూ వ్యాఖ్యానించారు. అలాగే వైస్సార్సీపీ ప్రభుత్వంఫై నేతల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

హైకోర్టుకు తాను అడ్డు పడుతున్నానని.. దుష్ప్రచారం చేస్తున్నారనీ.. అంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుండి ఉపయోగమేంటి? వాళ్లు రాష్ట్రానికి ఏమైనా పనికొస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. అలాగే జనసేన తో పొత్తు ఫై కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ తరువాత టీడీపీ – జనసేన మధ్య పొత్తు పైన కొత్త చర్చ మొదలైంది. కానీ, ఇప్పుడు చంద్రబాబు మరోసారి తామంతా కలిసే వస్తామని.. ఓట్ల విషయం మాత్రం ప్రజల ఇష్టమని చెప్పటం ద్వారా.. పొత్తు ఖాయమంటూ చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో పాటుగా.. అసెంబ్లీలో తాను చేసిన శపథం గురించి చంద్రబాబు ప్రస్తావించారు. వచ్చా. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచి గౌరవ సభలో అడుగు పెడతానని చెప్పారు. తాను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే.. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే.. ఎన్నికల్లో మనమంతా కష్టపడి గెలవాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్దంగా ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com