బహ్రెయిన్ లో ఎనిమిది లేబర్ సప్లై ఏజెన్సీలపై కొరడా.. 16 మంది అరెస్ట్
- November 18, 2022
బహ్రెయిన్: లైసెన్సు లేకుండా పనిచేస్తున్న ఎనిమిది గృహ కార్మికుల సరఫరా ఏజెన్సీలను బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ(ఎల్ఎమ్ఆర్ఎ) మూసివేయించింది. అలాగే రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ఘటనల్లో 16 మంది ప్రవాస కార్మికులను అదుపులోకి తీసుకున్నట్లు ఎల్ఎమ్ఆర్ఎ తెలిపింది. అరెస్టయిన కార్మికులలో వర్క్ పర్మిట్లను ఉల్లంఘించి పనిని విడిచిపెట్టిన వారు కూడా ఉన్నారని పేర్కొంది. లైసెన్స్ లేకుండా గృహ కార్మికులను నియమించుకోవడం, సరఫరా చేయడం వంటివి తనిఖీల సమయంలో గుర్తించినట్లు ఎల్ఎమ్ఆర్ఎ వెల్లడించింది. అరెస్టయిన వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని సమర్థ అధికారికి రిఫర్ చేసినట్లు తెలిపింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నార్తర్న్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాల (NPRA) సహకారంతో దుకాణాలు, వర్క్సైట్లు, లేబర్ వసతి గృహాలలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎల్ఎమ్ఆర్ఎ పేర్కొంది. www.lmra.bh ద్వారా లేదా 17506055కు కాల్ చేయడం ద్వారా కార్మిక ఉల్లంఘనలను నివేదించాలని ఎల్ఎమ్ఆర్ఎ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!