బహ్రెయిన్ లో 11 మంది డ్రగ్స్ పెడ్లర్ల అరెస్ట్
- November 19, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో గంజాయి మొక్కలను పెంచడం, మాదకద్రవ్యాలను విక్రయించడానికి నిల్వ చేసిన 11 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. అనుమానితుల్లో యూరప్, ఆసియా, ఇతర ఖండాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీస్‌లోని డ్రగ్ క్రైమ్ యూనిట్‌కు అందిన పక్కా సమాచారంపై విచారణ అనంతరం అరెస్టులు జరిగాయని అధికారులు వెల్లడించారు. విచారణలో నిందితులు తెలిపిన సమాచారంతో కొకైన్, హషీష్, గంజాయి మొక్కలను పెంచడానికి ఉపయోగించే సాధనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితులు నేరాలు చేసినట్లు అంగీకరించారని, తదుపరి విచారణ కోసం రిమాండ్‌కు తరలించినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. ఈ కేసును క్రిమినల్ విచారణకు రిఫర్ చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సిద్ధమవుతోందన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..