కువైట్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ 60వ వార్షికోత్సవం.. ఆకట్టుకున్న ఎగ్జిబిషన్
- November 19, 2022
కువైట్: కువైట్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ తన 60వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్.. నర్సింగ్ ఇన్స్టిట్యూట్ విభాగాలు, చరిత్రను తెలియజెప్పింది. ఇన్స్టిట్యూట్ తన అత్యంత ముఖ్యమైన మైలురాళ్లకు సంబంధించిన సంఘటనలను తెలిపేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నది. ఈ ఈవెంట్ కువైట్ ఆర్మీ, నేషనల్ గార్డ్ వంటి ఇన్స్టిట్యూట్లో మెడికల్ నర్సరీలో శిక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై కూడా అవగాహన కలిగించేలా దృష్టి సారించింది. కువైట్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ ను 1962 అక్టోబరు 27న స్థాపించారు. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో నర్సింగ్‌కి సంబంధించిన వివిధ అంశాలలో ఈ సంస్థ కోర్సులు, శిక్షణలను అందిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..