BD240 దుర్వినియోగం.. టాప్ కంపెనీ అధికారికి సంవత్సరం జైలు శిక్ష
- November 20, 2022
బహ్రెయిన్: తన కంపెనీ అడ్వర్టైజింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం నకిలీ రసీదులను తయారు చేసి నిధులను స్వాహా చేసినందుకు ఓ ఉన్నతాధికారికి ఏడాది జైలు శిక్ష పడింది. కంపెనీలో కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడని ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు పేర్కొంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మునిసిపల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పట్టణ ప్రణాళిక కింద పబ్లిక్ రోడ్లపై ప్రకటనల సైన్ బోర్డుల కోసం అతని కంపెనీ యాజమాన్యంలోని లైసెన్స్‌లను పునరుద్ధరించడానికి అతనికి అధికారం ఉంది. సైన్‌బోర్డ్‌ను అద్దెకు తీసుకున్నందుకు మంత్రిత్వ శాఖ కంపెనీ BD80 వసూలు చేస్తోంది. అనుమానితుడు లైసెన్స్‌ను పునరుద్ధరించడానికి బదులుగా తేదీలు మార్చి పాత రశీదును ఉపయోగించాడు. ఆ తర్వాత కంపెనీకి ఫైల్ చేసి డబ్బులు జేబులో వేసుకున్నాడు. ఈ విధంగా సదరు ఆఫీసరు BD240 జేబులో పెట్టుకోవడానికి మూడు రసీదులను మార్చాడు. అయితే ఫీజులు చెల్లించడం లేదంటూ మంత్రిత్వ శాఖ తమ సైన్ బోర్డులను తొలగించినట్లు కంపెనీ అధికారులు గుర్తించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో డైరెక్టర్ దాఖలు చేసిన రశీదులతో అధికారులు మంత్రిత్వ శాఖను సంప్రదించగా, అవన్నీ నకిలీవని తేలింది. దీంతో కంపెనీ నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అధికారులు అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!