ఎక్స్‌పో సిటీ దుబాయ్: Dh30 కంటే తక్కువ ధరకు ఫిఫా ప్రపంచ కప్ లైవ్ యాక్షన్స్

- November 20, 2022 , by Maagulf
ఎక్స్‌పో సిటీ దుబాయ్: Dh30 కంటే తక్కువ ధరకు ఫిఫా ప్రపంచ కప్ లైవ్ యాక్షన్స్

దుబాయ్: ఫుట్ బాల్ అభిమానులకు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచులను లైవ్ లో చూపించేందుకు ఎక్స్‌పో సిటీ దుబాయ్‌ సిద్ధమైంది. నివాసితులు, సందర్శకులు 30 దిర్హామ్‌లు మాత్రమే చెల్లించి ఒక రోజు మొత్తం ఫుట్‌బాల్‌ మ్యాచులను ఆస్వాదించవచ్చు.  పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పించారు. భారీ స్క్రీన్‌లపై మ్యాచ్‌లను వీక్షించడంతోపాటు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఎంటర్ టైన్ జోన్లలో సరదాగా గడపవచ్చు. రేపు ఖతార్‌లో ప్రారంభమవుతున్న ఫిఫా ప్రపంచ కప్ ను ప్రారంభ వేడుకలను, మొదటి మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఎక్స్‌పో సిటీ దుబాయ్ ఫ్యాన్ సిటీలో మూడు భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com