రూపాయికే నల్లా కనెక్షన్ ఉత్తర్వులను ఒకట్రెండు రోజుల్లో..
- April 23, 2016
తెలంగాణ పురపాలక శాఖ నిర్ణయం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు తెలంగాణలోని అన్ని పురపాలక సంఘాల్లో ఇక ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వబోతున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ దీనికి సంబంధించి సమగ్ర విధివిధానాలతోకూడిన ఉత్తర్వులను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించడం, జవాబుదారీతనం పెంచడానికి రూపాయికే నల్లా కనెక్షన్ విధానం ఉపయోగపడుతుందని మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డిల నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికకు ఇటీవల మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో నల్లా కనెక్షన్లు ఇవ్వడంపై అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటికే కరీంనగర్ నగరపాలక సంస్థలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అదేతరహాలో రాష్ట్రవ్యాప్తంగా కనెక్షన్లు ఇవ్వనున్నారు. కనెక్షన్‌ను క్రమబద్ధీకరించుకునే వారికి అపరాధ రుసుము కూడా వసూలు చేయరాదని ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







