కువైట్ లో 5 ఏళ్లలోపు పిల్లలకు డిపెండెంట్ వీసాలు జారీ
- November 21, 2022
కువైట్: తల్లిదండ్రులిద్దరూ దేశంలో చెల్లుబాటయ్యే రెసిడెన్సీ పర్మిట్లను కలిగి ఉన్నట్లయితే, వారి ఐదేళ్లలోపు పిల్లలకు కుటుంబ వీసాల కోసం దరఖాస్తులను ఆమోదించనున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చాలా నెలల క్రితం ప్రవాసుల వీసాలపై కువైట్ పూర్తి నిషేధాన్ని విధించింది. స్థానిక కంపెనీలకు వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు వాణిజ్య వీసాల జారీని మాత్రమే అధికారులు అనుమతించారు. వీసాల జారీపై ఉన్న ఆంక్షలను తాజాగా సడలించారు. తాజా ఉత్తర్వులు ప్రకారం.. ఐదేళ్లలోపు తమ పిల్లలను దేశంలో వారితో కలిసి జీవించాలనుకునే ప్రవాస జంటల దరఖాస్తులను ఇమ్మిగ్రేషన్ విభాగం పరిశీలించనున్నది. పిల్లల తల్లిదండ్రులు దేశంలో చట్టబద్ధమైన నివాస అనుమతిని కలిగి ఉండాలని, కనీసం KD 500 నెలవారీ జీతం ఉండాలని నిర్దేశించింది. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు జీతం నిబంధన నుండి మినహాయింపు ఉంటుందని తెలిపింది. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయమూర్తులు, ఇతర రంగాల రంగాల నిపుణులకు జీతం నిబంధన నుంచి ఆదివరకే మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!