మాదక ద్రవ్యాల గుట్టు రట్టు: 23 మంది చొరబాటుదారులు అరెస్ట్
- November 22, 2022
మస్కట్ : మాదక ద్రవ్యాల గుట్టును రాయల్ ఒమన్ పోలీసులు (ROP) రట్టు చేశారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటు 23 మంది చొరబాటుదారులను అరెస్టు చేశారు. నార్త్ బతినా గవర్నరేట్‌లోని కోస్ట్ గార్డ్ పోలీసులు సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 20 మంది చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మరో సంఘటనలో సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు ముగ్గురు చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







