తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన ప్రభుత్వం
- November 22, 2022
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపింది. దీనికిగాను మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చర్యలు తీసుకుంటున్నారు. ఇదివరకే బస్తీ దవాఖానాల పేరుతో పట్టణాల్లో నిర్వహిస్తున్న ఆస్పత్రులతో పాటు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. ఈ నెలలో రెండు వేల పల్లె దవాఖానాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యం అందజేయాలని సర్కార్ చూస్తోంది. దీనికి గాను పటిష్ట చర్యలు తీసుకుంటోంది. త్వరలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. దీంతో ఇక మీదట ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిర్ణయించింది. ఆరోగ్యశ్రీలో ఇదివరకే వైద్యం అందుతుండగా ఇప్పుడు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు ముందుకు రావడంతో ఇక ప్రజలకు మరింత మెరుగైన రీతిలో వైద్య సేవలు అందుతాయని చెబుతున్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







