బుర్జ్ ఖలీఫాపై న్యూఇయర్ వేడుకలు: రికార్డు సృష్టించేలా బాణసంచా ప్రదర్శన
- November 25, 2022దుబాయ్: 2023 నూతన సంవత్సర వేడుకలకు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సిద్ధమవుతోంది. ఈసారి స్పెషల్ బాణాసంచా ప్రదర్శనతో కొత్త ప్రపంచ రికార్డులను నెలకోల్పడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మాస్టర్ డెవలపర్ ఎమ్మార్ ప్రకటించింది. కొత్త సంవత్సర ప్రారంభానికి సూచనగా 'ప్రపంచంలోనే అతిపెద్ద లేజర్ డిస్ప్లే'ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతో 828-మీటర్ల బుర్జ్ ఖలీఫా అత్యాధునిక లేజర్ షో కేంద్రంగా మారుతుందన్నారు. ఈ లేజర్ కాంతి కిరణాలు ఇప్పటివరకంటే అత్యంత ఎక్కువ దూరం వరకు కనిపిస్తాయన్నారు. 2010 నుండి ప్రఖ్యాత పైరోటెక్నిక్ ప్రదర్శన ద్వారా బుర్జ్ ఖలీఫా వద్ద అద్భుతమైన బాణసంచా ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్ వెల్లడించింది. బుర్జ్ ఖలీఫా బేస్ వద్ద ఉన్న దుబాయ్ ఫౌంటెన్ దగ్గర కూడా ఒక ప్రత్యేక మ్యూజిక్ షోను ఏర్పాటు చేసినట్లు, సందర్శకులను అది ఎంతగానో ఆకట్టుకుంటుందని ఎమ్మార్ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..