సందర్శకులకు స్వాగతం పలుకుతున్న 'అమద్ దుక్మ్ 22'
- November 25, 2022
మస్కట్: దుక్మ్‌లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో 'అమద్ దుక్మ్ 22' ప్రారంభానికి సిద్ధమైంది. శుక్రవారం నుండి 9 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ ను పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ ఫ్రీ జోన్స్ (OPAZ), మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 'అమద్ దుక్మ్ 22' ఈవెంట్ లో సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్, ఎంటర్ టైన్ మెంట్ సంబంధించిన సృజనాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సంస్కృతి, ఆవిష్కరణలు, క్రీడలు, సాంకేతికత లతో పాటు ఈ ప్రాంతంలో ఆర్థిక సామర్థ్యాన్ని.. పెరుగుతున్న పెట్టుబడులను పరిచయం చేయడం ఈ ఈవెంట్ వెనుక ఉన్న ఆలోచన అని డుక్మ్‌లోని స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్టింగ్ సీఈఓ ఎంగ్ అహ్మద్ బిన్ అలీ అకాక్ పేర్కొన్నారు. భవిష్యత్తు ఆకాంక్షలను సాధించడంలో యువతది కీలక పాత్ర కాబట్టి వారి సృజనాత్మకతను పెంపొందించేందుకు అమద్ దుక్మ్ 22 ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







