కువైట్ లో కలరా కేసు నమోదు

- November 27, 2022 , by Maagulf
కువైట్ లో కలరా కేసు నమోదు

కువైట్: కలరా వ్యాప్తితో బాధపడుతున్న పొరుగు దేశం నుండి ఇటీవల తిరిగి వచ్చిన ఒక జాతీయుడిలో కలరా సంక్రమణ లక్షణాలను గుర్తించినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కలరా సోకిన పౌరుడు క్వారంటైన్ లో ఉన్నారని, అతను కోలుకునే వరకు మంత్రిత్వ శాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కలరా సంబంధిత ప్రోటోకాల్‌ల ప్రకారం.. కేసును డీల్ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో కలరా వ్యాప్తి చెందే అవకాశాన్ని మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అయితే కలరా వ్యాప్తిని నివేదించిన దేశాలను సందర్శించేటప్పుడు జాతీయులు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని.. అసురక్షిత నీరు, ఆహార పదర్థాలకు దూరంగా ఉండాలని సూచించింది. వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలలో పర్యటించి వచ్చిన ఏడు రోజులలోపు జ్వరం, డయేరియా, కలరా వంటి అనుమానిత లక్షణాలను గుర్తిస్తే.. అవసరమైన సలహాలు, చికిత్సను పొందేందుకు సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com