కువైట్ ఇండియన్ ఎంబసీలో ఘనంగా ‘భారత రాజ్యాంగ దినోత్సవం’
- November 27, 2022
కువైట్: భారత రాయబార కార్యాలయంలో 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని (సంవిధాన్ దివస్) నవంబర్ 26న ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎంబసీ ఛార్జ్ డి' అఫైర్స్ (Cd'A) స్మితా పాటిల్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవం భారతదేశంలోని ప్రతి పౌరుడికి పండుగ లాంటిదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత ప్రజాస్వామ్యానికి పునాది రాజ్యంగం అని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగం భారతీయులకు ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తుందన్నారు. తన ప్రసంగంలో 26 నవంబర్ 2008న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. అలాగే కువైట్‌లోని భారతీయ ప్రవాసుల ఇండియాలోని మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జనవరి 8-10 తేదీల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్-2023 (PBD)లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కువైట్‌లోని భారతీయ విద్యార్థులు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి 16 విభిన్న భారతీయ భాషల్లో భారత రాజ్యంగ ప్రవేశికను చదివి వినిపించారు. భారత రాజ్యాంగ నిర్మాణంపై నిర్వహించిన ఎగ్జిబిషన్ ఆహుతులను ఆకట్టుకున్నది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









