ప్రబాస్ కొత్త గాళ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా.?
- November 28, 2022
యూనివర్సల్ స్టార్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రబాస్, టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పెళ్లి వయసు దాటిపోతున్నా, ఆ మాట ఎత్తితే మాట దాటేస్తుంటాడు ఎప్పటికప్పుడే ప్రబాస్.
అయినా కానీ, ప్రబాస్ గాళ్ ఫ్రెండ్ ఎవరంటే.. ఠక్కున అనుష్క అని చెప్పేసేంత ఓ ఐడియా వుంది జనంలో. కానీ ఈ కొత్త ముచ్చట వింటే షాకవ్వాల్సిందే. ప్రబాస్ గాళ్ ఫ్రెండ్ అనుష్క కాదట. అనుష్క జస్ట్ ఫ్రెండ్ అంతే.
ప్రబాస్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటోన్న ముద్దుగుమ్మ వేరే. ఆమె ఎవరో కాదు కృతి సనన్. అదేనండీ పొడుగు కాళ్ల భామ కృతి సనన్. ఈ ముద్దుగుమ్మతో ప్రబాస్ ఇప్పుడు ‘ఆది పురుష్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రీల్ సీతా రాములు, రియల్ సీతారాములవ్వాలనుకుంటున్నారట. అయితే, ఇది కేవలం కృతి సనన్ వైపు నుంచేనండోయ్. కృతి సనన్‌కి ప్రబాస్ అంటే చాలా ఇష్టమట. ఆయనను పెళ్లి చేసుకుంటానంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పిందని తాజాగా బయట పడింది.
ఇక లేటెస్టుగా ఆమె నటించిన భేడియా, తెలుగులో ‘తోడేలు’ సినిమా ప్రమోషన్లలో కృతి లవ్ స్టోరీని వరుణ్ ధావన్ బయట పెట్టాడు. కృతి లవర్, బాలీవుడ్లో లేడు. కూడా యూనివర్సల్ హీరో.. ఇద్దరూ డేటింగ్లో వున్నారంటూ హింట్ ఇచ్చాడు. మరి, నిజంగానే కృతి సనన్, ప్రబాస్ పెళ్లి చేసుకుంటారా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







