బూస్టర్ డోస్‌గా ‘ఇన్కోవాక్’..
- November 29, 2022
కరోనా మహమ్మారి నివారణకు ఇప్పటికే కొన్ని రకాల బూస్టర్ డోస్ లో వచ్చాయి. కోవిడ్ వైరస్ ను నివారించేందుకు తాజాగా మరో బూస్టర్ డోసును అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే తొలిసారి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL) అభివృద్ధి చేసిన చుక్కల మందు ‘ఇన్కోవాక్’ను ఇకపై బూస్టర్ డోసుగానూ వినియోగించుకోవచ్చు. ఇది ముక్కు ద్వారా తీసుకొనే టీకా. దీనికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అనుమతులు మంజూరు చేసినట్లు బీబీఐఎల్ ప్రకటించింది.
18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన అత్యవసర పరిస్థితుల్లో దీనిని వినియోగించేందుకు పరిమిత స్థాయిలో అనుమతులు మంజూరైనట్లు వెల్లడించింది. ఇప్పటికే కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్‌ను రెండు డోసులు తీసుకుని ఆరు నెలలు దాటినవారు మాత్రమే ఇన్కోవాక్ను బూస్టర్ డోసుగా తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొంది.
ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్లకు పెద్దగా డిమాండ్ లేనప్పటికీ భవిష్యత్తులో వచ్చే అంటువ్యాధులను అడ్డుకోవడానికి ఇన్కోవాక్ను అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!