ఎమిరైటేషన్ దుర్వినియోగం: ఎమిరాటీ కంపెనీకి 4.3 మిలియన్ల జరిమానా?
- November 29, 2022
యూఏఈ: ఎమిరైటేషన్ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఓ ఎమిరాటీ కంపెనీ యజమాని తమ కంపెనీలో పని చేయడానికి 43 మంది కుటుంబ సభ్యులను నియమించుకున్నందుకు 4.3 మిలియన్ల వరకు జరిమానా విధించవచ్చుని అధికారులు తెలిపారు.ప్రభుత్వం నిర్దేశించిన ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకునేందుకు కంపెనీలు చేపట్టిన నియామకాలపై దృష్టి సారించినట్లు మానవ వనరులు, ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (MoHRE) తెలిపింది. కుటుంబ సభ్యులను నియమించుకోవడం నిబంధనలకు విరుద్ధం కానప్పటికీ, ఎమిరేటైజేషన్ కోటాను భర్తీ చేసే క్రమంలో ఎవరైనా నకిలీ పోస్టులను క్రియేట్ చేసి వాటిల్లో బంధువులను నియమించుకుంటే వారిపై చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఎమిరేటైజేషన్ సంబంధిత చట్టాలను ఉల్లంఘనకు పాల్పడితే ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవడంతోపాటు భారీ జరిమానాలను విధిస్తామని పేర్కొంది. నిబంధనలను కాదని నియమించుకునే ప్రతి ఎమిరాటీకి Dh100,000 చొప్పున జరిమానా విధించబడుతుందని, ఆయా కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్య కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!