పిల్లల్లో పెంకితనం పోవాలంటే

- June 17, 2015 , by Maagulf
పిల్లల్లో పెంకితనం పోవాలంటే

పిల్లల్లో మూడేళ్ల వయసు వచ్చేసరికి పెంకితనం మొదలవుతుంది. అంటే చూసిందల్లా కావాలనడం, నచ్చిందల్లా చేసేయ్యాలనడంలాంటివి. అయితే అన్ని సందర్భాల్లోనూ ఈ రకమైన ప్రవర్తనను తల్లితండ్రులు తప్పు పట్టకూడదు. కొన్ని సందర్భాల్లో వారిని సున్నతంగా మందలించాలి. మరికొన్ని సందర్భాల్లో వాళ్ల కోరికను నెరవేర్చాలి కూడా. పిల్లల్లో ఈ వయసు కాస్త ఊహ తెలిసే సమయం. ఈ వయసులో ప్రతిదీ కొత్తగా కనిపిస్తుంది. ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇలాంటప్పుడు వారిని నిరాశపరచడం సరి కాదు. కానీ జాగ్రత్తగా మలచుకొనే ప్రయత్నం చేయాలి. వారి ఆతృతను అర్ధం చేసుకోవాలి. పిల్లలు తరచూ కోపానికి గురవుతున్నారా? మనతోనే అలా ఉంటున్నారా? లేక బయటి స్నేహితులతో కూడా అలాగే మెలగుతున్నాడా? అనేది ముందుగా గమనించుకోవాలి. కేవలం మనతోనే అలా ప్రవర్తిస్తున్నాడనుకుంటే మన తీరేదో వాళ్లని నొప్పించి ఉండొచ్చుననుకొని దాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా పిల్లల ప్రవర్తనలో కొంత మార్పు తీసుకురావడానికి తోడ్పడుతుంది. అంతే కానీ అతిగా నియంత్రించాలనుకోవడం, తీవ్రంగా మందలించాలనుకోవడం కూడా సరైన పద్దతి కాదు. అది వారి మెదడుపై ప్రభావాన్ని చూపి విపరీత ప్రవర్తనలకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. ప్రతిదీ పద్ధతిగా ఉండాలని మీరనుకోవచ్చు. పెద్దలుగా వారి మంచి చెడులు మీకు తెలియొచ్చు. కానీ అంతమాత్రాన వారి ఇష్టాఇష్టాలు గుర్తించకుండా మన అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దాలని ప్రయత్నించొడ్డు. ఒక్కోసారి వాళ్ల మాటలకే విలువిస్తూ ఆ విషయాన్ని వారికి అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చెయ్యాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com