ఫిఫా ప్రపంచకప్: ముగిసిన సౌదీ అరేబియా ప్రయాణం
- December 01, 2022
దోహా: దోహాలోని లుసైల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన FIFA వరల్డ్ కప్ 2022 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల మూడో రౌండ్‌లో మెక్సికోతో 1-2 తేడాతో ఓడిపోవడంతో సౌదీ అరేబియా నాకౌట్ 16లో ప్రవేశించాలనే 28 ఏళ్ల కల చెదిరింది. గ్రీన్ ఫాల్కన్‌లు తమ మొదటి మ్యాచ్ లో అర్జెంటీనాను 2–1 పై చారిత్రాత్మక విజయం సాధించి అభిమానుల్లో ఆశలు పెంచారు. కానీ ఆ తర్వాత పోలాండ్, మెక్సికో చేతిలో ఓడిపోయి గ్రూప్‌లో చివరి స్థానంలో తన ప్రయాణాన్ని ముగించింది.
ప్రపంచ కప్‌లో ఆరుసార్లు పాల్గొన్న సౌదీ జట్టు 1994లో టోర్నమెంట్‌లో ఒక్కసారి మాత్రమే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. ఆరు పాయింట్లతో అర్జెంటినా గ్రూప్ లో టాప్ లో ఉన్నది. అర్జెంటీనా చేతిలో 2-0 తేడాతో ఓడిపోయిన పోలాండ్ రెండో స్థానంలో.. నాలుగు పాయింట్లతో మెక్సికో మూడో స్థానంలో.. సౌదీ అరేబియా 3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్‌జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!