ఫుడ్ డెలివరీ కంపెనీలకు కొత్త నియమాలు
- December 06, 2022
కువైట్: రవాణా, డెలివరీ కార్యకలాపాలకు సంబంధించి కొన్ని నిబంధనలను సవరించాలని అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సబా ఉత్తర్వులు జారీ చేశారు. “లాజిస్టిక్స్ సేవలను అందించడం, వినియోగదారుల ఆర్డర్లు అందించడం లేదా వస్తువులను రవాణా చేయడం వంటి వాటి కార్యకలాపాల్లో ఉన్న కంపెనీలు, సంస్థలకు మోటరైజ్డ్ వాహనాల కోసం కొత్త లైసెన్స్‌ల జారీ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. ప్రస్తుతం ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్న కంపెనీలు, సంస్థలకు సేవలో లేని వాహనాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావడానికి అనుమతి ఉంది. ”అని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షరతులు, నియంత్రణలకు అనుగుణంగా కొత్త మోటరైజ్డ్ వాహనాలను నమోదు చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. డెలివరీ సేవల్లో ఉండే సంస్థలు ఒక ప్రైవేట్ కారు, ఐదు తేలికపాటి రవాణా వాహనాలు (రెండు టన్నులలోపు) లేదా ఆరు మోటార్‌బైక్‌లు, ఒక ప్రైవేట్ కారు లేదా ఒక తేలికపాటి రవాణా వాహనం.. వాహనాల మొత్తం సంఖ్య 90కి మించకూడదని తాజా ఉత్తర్వుల్లో తెలిపారు. రిజిస్టర్ చేసుకునేటప్పుడు వాహనాలు తప్పనిసరిగా మూడు సంవత్సరాల కంటే పాతవి కాకూడదని, వాటి తయారీ సంవత్సరం తర్వాత ఏడేళ్ల తర్వాత సర్వీస్ నుండి తప్పించాలని స్పష్టం చేసింది. అన్ని వాహనాలకు పసుపు రంగు లైసెన్సు ప్లేట్లు ఉండాలి. వాహనం డ్రైవర్ కంపెనీ లేదా సంస్థ-నిర్దిష్ట చొక్కా ధరించాలి. మోటారుబైక్ల డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అది ఫాస్ఫోరేసెంట్ రంగులో ఉండాలి. హైవేలు, రింగ్ రోడ్లపై మోటర్‌బైక్‌లు నడపకూడదని తాజా ఉత్తర్వుల్లో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కటారాలో ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $140 బిలియన్లు..!!
- దుబాయ్ లో వర్క్, బిజినెస్ వల్లే 90% ట్రాఫిక్ రద్దీ..!!
- ఒకే రోజు 3,206 ట్రాఫిక్ వయోలేషన్స్ నమోదు..!!
- ఒమన్ లో వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో మహిళకు 10ఏళ్ల జైలుశిక్ష.. BD5,000 ఫైన్..!!
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!









