రైతు రుణమాఫీ కోసం రెండో విడతలో భాగంగా రూ.3,250 కోట్లు విడుదల..
- April 24, 2016
రెండో విడత రుణమాఫీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సంతకం చేశారు. గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో ఈ రోజు ఉదయం ఏపీ తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ కోసం రెండో విడతలో భాగంగా రూ.3,250 కోట్లు విడుదల చేస్తూ ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతు రుణమాఫీపై ఈరోజు సంతకం చేశాన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తానని సీఎం చెప్పారు. రైతులు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని సీఎం అన్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







