భారత్ వచ్చే బ్రిటన్ ప్రయాణికులకు శుభవార్త...
- December 06, 2022
లండన్: లండన్‌లోని భారత హైకమిషన్ సోమవారం కీలక ప్రకటన చేసింది. బ్రిటన్ ప్రయాణికుల కోసం ఎలక్ట్రానిక్ వీసాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలి నెలల్లో ఇండియాకు వీసాల కోసం భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా యూకేలోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ.. ఈ సర్వీస్ వెంటనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. "ఈరోజు పెద్ద వార్త ఏమిటంటే, మేము మరోసారి ఇ-వీసాలను పునరుద్ధరిస్తున్నాము. ఇది యూకే నుండి ఇండియాకు చాలా సులభంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది" అని దొరైస్వామి ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.
ఇక ఈ వారం నుంచి ప్రయాణికులు భారతదేశానికి ఇ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని లండన్‌లోని హైకమిషన్ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం సిస్టమ్ అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతోందని, భారతీయ వీసా వెబ్సైట్ త్వరలో ఈ-వీసాల కోసం దరఖాస్తులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కాగా, భారత హైకమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై బ్రిటన్ స్పందించింది. గత నెలలో ఇండోనేషియాలో జరిగిన G20 సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మధ్య జరిగిన భేటీలో చర్చించిన అంశాలలో ఇ-వీసాలు ఉన్నాయని యూకే పార్లమెంట్లో పేర్కొంది.
తాజా వార్తలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్‌లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర









