కొత్త ప్రోగ్రామ్‌ను ప్రకటించిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్
- December 06, 2022
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) ద్వారా ప్రయాణించే పలు వైకల్యాలున్న వ్యక్తులందరికీ (POD) మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి సమగ్రమైన కొత్త ప్రోగ్రామ్‌ను పరిచయం చేస్తున్నట్లు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లు ప్రకటించింది. కొత్త ప్రోగ్రామ్ రెండు సంవత్సరాలలో రెండు దశల్లో ప్రారంభమవుతుందన్నారు. ఆటిజం, క్రానిక్ ఫెటీగ్, PTSD (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) ఉన్న ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని పెంచడానికి ప్రత్యేక సిబ్బందని ఏర్పాటు చేసినట్లు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ తెలిపింది. POD ప్రయాణికుల ముందస్తు ప్రయాణ తయారీ కోసం ట్రావెల్ ప్లానర్‌ను, ఆటిజం ఫ్రెండ్లీ రూట్‌ను పరిచయం చేస్తాయని దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పేర్కొంది. పీఓడీ ప్రయాణికులు చెక్-ఇన్, పాస్‌పోర్ట్ నియంత్రణ, సెక్యూరిటీ చెక్ పాయింట్, బోర్డింగ్ కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సన్‌ఫ్లవర్ లాన్యార్డ్ ధరించిన ప్రయాణికులు ఈ ప్రత్యేక సదుపాయాలని పొందవచ్చన్నారు. సన్‌ఫ్లవర్ లాన్యార్డ్ అనేది ప్రత్యేక అవసరాలు గల వారిని సులువుగా గుర్తించేందుకు ఉపయోగిస్తారు. అదనపు సహాయం అవసరమయ్యే ఎవరైనా వీటిని ధరించవచ్చు. POD ప్రయాణీకులకు సాయంగా నిలిచేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది సన్‌ఫ్లవర్ పిన్స్ ధరించి ఉంటారని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ COO, మజేద్ అల్ జోకర్ తెలిపారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్‌ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









