డ్రగ్స్ వినియోగం: వ్యక్తికి 60,000 దిర్హామ్‌ల జరిమానా
- December 08, 2022
దుబాయ్: డ్రగ్స్ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతా ద్వారా నిధులు బదిలీ చేసిన అరబ్ వ్యక్తిని దుబాయ్ క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితుడు మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నారని, ఉపయోగించారని పేర్కొంటూ దుబాయ్ పోలీసులలోని డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందిందని పోలీసు రికార్డులు వెల్లడించాయి. పోలీసు బృందం అతని నివాసం, కారును పరిశీలించడానికి.. అతని నుండి మూత్ర నమూనాను పొందడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందింది. అనంతరం పోలీసు బృందం అతని నివాసంపై దాడి చేసిందని, అక్కడ గంజాయి, డ్రగ్ చిన్న బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వాట్సాప్ ద్వారా ప్రొఫెషనల్ ఏషియన్ డీలర్‌తో కమ్యూనికేట్ అయినట్లు వెల్లడించాడు. ఏటీఎం ద్వారా డీలర్ ఖాతాలో డబ్బును జమ చేశానని, ఆపై డీలర్ సూచించిన స్థలం నుండి డ్రగ్ తీసుకున్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. మాదక ద్రవ్యాల గురించి వాట్సాప్ ద్వారా యాదృచ్ఛికంగా వచ్చిన అనామక సందేశాలకు స్పందించవద్దని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!
- సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- రమదాన్ స్పెషల్..మదీనాకు షటిల్ బస్సులు..!!
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..









