జాన్వీ ఆ సౌత్ హీరోని అడిగేసిందట.!

- December 08, 2022 , by Maagulf
జాన్వీ ఆ సౌత్ హీరోని అడిగేసిందట.!

బాలీవుడ్ బ్యూటీ అనే ట్యాగ్‌ని మార్చుకోలేకపోతోంది జాన్వీ కపూర్. ప్యాన్ ఇండియా స్టార్ కావల్సిన బ్యాక్ గ్రౌండ్, ఇమేజ్ వున్నాయ్ జాన్వీ కపూర్‌కి. కానీ, ఏం లాభం.? ఎక్కడ తేడా కొడుతుందో తెలీదు కానీ, కేవలం బాలీవుడ్‌కే పరిమితమైపోయింది. అది కూడా సెలెక్టివ్ మూవీస్‌కే.
తాజాగా జాన్వీ కపూర్ గురించి ఓ టాక్ సర్క్యులేట్ అవుతోంది. సౌత్‌లో సినిమాలు చేయాలని జాన్వీ కోరుకుంటోందట. కానీ, ఎందుకో అది కుదరడం లేదట. తండ్రి బోనీకపూర్ రూపంలోనే అడ్డు తగులుతోందన్న అనుమానాలు లేకపోలేదు.
తెలుగులో ఎన్టీయార్ సరసన, తమిళంలో విజయ్ సేతుపతి సరసన నటించాలని వుందని జాన్వీ ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టింది.
విజయ్ సేతుపతిని జాన్వీ అడిగేసిందట కూడా. కానీ, విజయ్ సేతుపతి అందుకు సమాధానం చెప్పలేకపోయారట. దానికి కారణం వేరే అనుకోండి. అయినా, జాన్వీ ఊ అంటే చాలు.. సౌత్‌లో వరుసగా ఆఫర్లు ఇచ్చేందుకు రెడీగా వున్నారు మేకర్లు. 
తెలుగులో అయితే మరీను. శ్రీదేవిపై వున్న అభిమానంతో ఎప్పుడో జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుని వుండేది తెలుగులో. ఆ యోగం ఇంకెప్పటికి జాన్వీని వరించనుందో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com