సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.! నిజమేనా.?
- December 08, 2022
సాయి పల్లవిని చూస్తే, ఆమె నటించిన పాత్రలే గుర్తుకొస్తాయ్. అంతలా ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తుంటుంది సాయి పల్లవి. అందుకే హీరోయిన్ల యందు సాయి పల్లవి వేరయా అంటారు.
సాయి పల్లవికి పెళ్లియపోతుందట, ఇకపై నటనకు గుడ్ బై చెప్పేస్తుందట.. అంటూ ఈ మధ్య గాచిప్స్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇంతలోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
రామాయణం నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా బాలీవుడ్‌లో రూపొందుతోన్న సినిమాలో సాయి పల్లవికి ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ రావణుడి పాత్ర పోషించనున్నాడట.
ఈ ప్రాజెక్టులో సీత పాత్ర కోసం ఏరి కోరి మరీ, సాయి పల్లవిని ఎంచుకున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో కానీ, ఒకవేళ నిజమే అయితే, సీత పాత్రలో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌కి అదనపు ఆకర్షణ అవుతుందనడం నిస్సందేహం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయ్.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







