‘కనెక్ట్’ అవ్వాల్సిందే అంటోన్న నయనతార.!
- December 09, 2022
ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన నయన తార తాజాగా మరో చిత్రంలో నటించింది. అదే ‘కనెక్ట్’. హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.
అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని రౌడీ పిక్చర్స్ బ్యానర్లో నయన తార స్వయంగా నిర్మించడం విశేషం. తెలుగులో ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది. డిశంబర్ 22న ‘కనెక్ట్’ రిలీజ్ కాబోతోంది.
99 నిమిషాల నిడివితో, ఇంటర్వెల్ లేకుండా ఈ సినిమాని లాక్ చేశారు. ఇంటర్వెల్ లేకుండా సినిమాని నడిపించడం అనేది నిజంగా సాహసమే అని చెప్పాలి. టైటిల్లోనే వుందిగా. ‘కనెక్ట్’ అని. ఆ కనెక్షన్ దెబ్బ తినకూడదనే వుద్దేశ్యంతోనే ఈ సినిమాని ఇంటర్వెల్ లేకుండా నడిపించారట. ట్రైలర్‌తోనే అంతలా కనెక్ట్ చేసిన మేకర్లు, సినిమాతో ఇంకెంతలా కనెక్ట్ చేస్తారో చూడాలి మరి.
నయన్ స్వీయ నిర్మాణంలో వస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం, ఆడియన్స్‌లో ట్రైలర్‌తోనే విపరీతమైన ఆసక్తి పెంచేసింది.
తాజా వార్తలు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!







