తక్‌దీర్‌ అవార్డ్స్‌: వర్కర్స్‌ ఫ్రెండ్లీ కంపెనీల కోసం

- April 25, 2016 , by Maagulf
తక్‌దీర్‌ అవార్డ్స్‌: వర్కర్స్‌ ఫ్రెండ్లీ కంపెనీల కోసం

కన్‌స్ట్రక్షన్‌ రంగంలో వర్కర్స్‌ ప్రెండ్లీగా కంపెనీలు వ్యవహరించడానికి వీలుగా తక్‌దీర్‌ అవార్డులను దుబాయ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే దుబాయ్‌ అంటే ఆకాశ హార్మ్యాలకూ, మానవ నిర్మిత దీవులకూ పెట్టింది పేరు. నిర్మాణ రంగంలో అద్భుతాలను సృష్టిస్తోంది దుబాయ్‌. మరింతగా దుబాయ్‌లో కన్‌స్ట్రక్షన్‌ రంగాన్ని విస్తరింపజేసేందుకు, అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కార్మికులు, దుబాయ్‌లో పనిచేయడానికి ఇష్టత ప్రదర్శిందుకు వీలుగా కొత్త సంస్కరణలు తీసుకొస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే తక్‌దీర్‌ అవార్డులను ప్రవేశపెట్టారు. వర్కర్స్‌ ఫ్రెండ్లీ ఎట్మాస్ఫియర్‌ని కల్గించే కంపెనీలు, ముఖ్యంగా నిర్మాణ రంగంలో అద్భుతాలు సృష్టిస్తూనే, తమ వర్కర్లను బాగా చూసుకునే కంపెనీలకు ఈ అవార్డుల కోసం పోటీ పడే అవకాశం కల్పించారు. పాయింట్ల ప్రాతిపదికన కంపెనీలను ఎంపిక చేస్తారు. ఐదు లేదా నాలుగు స్టార్‌ రేటింగ్స్‌ సంపాదించిన కంపెనీలకు ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ప్రాధాన్యతనివ్వనున్నారు. అలాగే ప్రపంచ దేశాల్లోనూ వీరికి ప్రత్యేకమైన అవకాశాలు లభించనున్నాయి. ఈ అవార్డుల ద్వారా కంపెనీలు తమను ఇంకా బాగా చూసుకుంటాయని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com